కూనలమ్మలు | - | Sakshi
Sakshi News home page

కూనలమ్మలు

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

డ్యాన్సర్‌ అని పిలుస్తున్నారు అమ్మానాన్నల ప్రోత్సాహంతో.. క్యాంపులోనే సెలవులు రీల్స్‌ కంటే నృత్యం ముఖ్యం ఆంధ్ర నాట్యం నేర్చుకుంటున్న..

కూచిపూడి

ఆర్మూర్‌: వేసవి సెలవులను వృథా చేయకుండా ఆర్మూర్‌లోని నటరాజ నృత్యనికేతన్‌ లో చిన్నారులు ఆంధ్రానాట్యం, కూచిపూడి నేర్చుకుంటున్నారు. మాడవేడి నారాయణ స్థాపించిన నటరాజ నృత్య నికేతన్‌లో నాట్య గురువు డాక్టర్‌ బాశెట్టి మృణాళిని శిష్యరికంలో సమ్మర్‌ క్యాంప్‌లో మువ్వల సవ్వడి, అభినయం, లయలతో వేదికలను ఉర్రూతలూగిస్తున్నారు. పట్టణంలోని గంగా ఆస్పత్రి సమీపంలో కళాకారులను బ్యాచులుగా విభజించి నేర్పిస్తున్నారు. చిన్నారులు గజ్జె కట్టి అబ్బురపరిచే నృత్యరీతులతో మెప్పిస్తున్నారు.

నేను చాలా చిన్నదాన్ని కాబట్టి మొదట్లో భయం వేసేది. గురువు గారు ప్రోత్సహించారు. ఇప్పుడు స్టేజ్‌ ఎ క్కితే భయం లేదు.అందరూ నవ్వుతూ చూస్తారు. అ మ్మ ఫో న్‌లో వీడియో తీసి వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టింది. మా చుట్టా లు అందరూ నన్ను ‘డ్యాన్సర్‌’ అని పిలుస్తున్నారు. – శ్రీవర్ష

వేసవిలో ఫ్రెండ్స్‌తో కలిసి ఆడదామనుకున్నా. కానీ అమ్మా, నాన్న ఆంధ్ర నాట్యం గురించి చెప్పారు. తెలిసిన వాళ్లు డ్యాన్స్‌ క్లాస్‌కు వెళ్తుంటే నేను కూడా చేరా. ఇప్పుడు నాకు డ్యాన్సే ప్రాణం అయిపోయింది.

– నైనిత

కూచిపూడి, ఆంధ్ర నాట్యం రెండూ వేరు అని మేడమ్‌ చెప్పేవరకు నాకు తెలియదు. ఇప్పుడు రెండూ వచ్చు. స్కూల్స్‌ ఉన్నప్పుడు రోజూ చదువులు, పరీక్షలతో గడిచి పోయేది. ప్రస్తుత వేసవి సెలవులు నృత్యంతో తెలియకుండా గడిచిపోతున్నాయి.

– సుదీప్తి

నేను చిన్న క్లాస్‌. కానీ గురువు గారి సూచనల మేరకు నా ట్యం చేయడం నేర్చుకున్నా. మొదట భయమేసింది. ఇప్పుడు హాయి గా చేస్తున్నా. సెల్‌ఫోన్‌లో రీల్స్‌ చేయడం కాదు, స్టేజ్‌పైన రియల్‌ డ్యాన్స్‌ చేయా లని మేడమ్‌ చెప్పారు. అమ్మ, నాన్న కూడా హ్యాపీ.

– సాయినేత్ర

యూట్యూబ్‌లో డ్యాన్స్‌ వీడియోలు చూసి ఇంట్లోనే స్టెప్పులు వేసేదాన్ని. మేడమ్‌ దగ్గర చేరాక తప్పు, ఒప్పు తెలిసింది. ఇప్పుడు ఆంధ్ర నాట్యంలో మెళకువలు నేర్చుకుంటున్నాను. వేదికలపై నాట్యం చేసి అందరి మన్ననలు పొందాలని ఉంది.

– సహస్ర

అడుగుల సవ్వడిలో ఆంధ్ర నాట్యం

ఆర్మూర్‌లో నటరాజ నృత్యనికేతన్‌

ఆధ్వర్యంలో సమ్మర్‌ క్యాంపు

ఆంధ్రనాట్యం, కూచిపూడి

నేర్చుకుంటున్న చిన్నారులు

Advertisement
 
Advertisement
Advertisement