వర్ని: మండలంలోని జలాల్ పూర్ గ్రామ శివారులో గిరిజన రైతు సఖి( 52) కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. సిద్దాపూర్ గ్రామానికి చెందిన సఖి జలాల్‌పూర్ శివారులో సొంత పొలంతోపాటు సుమారు 20 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలు చేస్తున్నారు. ఆదివారం పొలం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గడ్డిమందు సేవించిన వృద్ధుడు..
జక్రాన్‌పల్లి: మండలంలోని సికింద్రాపూర్ గ్రా మానికి చెందిన పతిపాకల నడ్పి రాజన్న (70) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై మ హేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న రెండేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ ఒంటరిగా తన పాత ఇంట్లో నివసిస్తున్నాడు. కుమార్తె, కోడలు అవసరమైన సేవలు అందిస్తూ చికిత్స చేయిస్తున్నారు. ఈ నెల 12న రాజన్న గడ్డి మందును సేవించి అపస్మారక స్థితిలో ఉండగా కుటుంబసభ్యులు నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆదివారం చికిత్స పొందుతూ రాజన్న మృతి చెందినట్లు తెలిపారు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో ఆదివా రం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. జాయింట్ వీల్ విరిగి 10 మందికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్శకులు జాయింట్ వీల్ నిర్వాహకులు, సిబ్బందిపై దాడి చేశారు.
మోర్తాడ్: ఏర్గట్ల మండల కేంద్రంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బోడ భూమ య్య అనే వ్యక్తి ఇంట్లోని రెండు గదుల్లో మంటలు రావడంతో స్థానికులు అప్రమత్తమై ఆర్పే ప్రయ త్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. నష్టాన్ని అంచ నా వేస్తున్నామని తహసీల్దార్ మల్లయ్య తెలిపారు.


