విద్యావంతమైన సమాజ నిర్మాణం కోసం కృషి | - | Sakshi
Sakshi News home page

విద్యావంతమైన సమాజ నిర్మాణం కోసం కృషి

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

బాన్సువాడ రూరల్‌: సమాజంలో వివక్షకు గురైన మాలలను సంఘటితం చేసి వారిని చైతన్యపరిచి, విద్యావంతమైన సమాజ నిర్మాణం కోసం మాల ఎడ్యుకేషన్‌ సొసైటీ కృషి చేస్తుందని ఎంఈడబ్ల్యూఎస్‌ రాష్ట్ర నాయకులు అయ్యాల సంతోష్‌ అన్నారు. ఆదివారం సంగోజీపేట్‌ గ్రామంలో పర్యటించి మాల కులస్తులు, విద్యార్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, మహాత్మా జ్యోతీబాపూలే చూపిన బాటలో నడవాలన్నారు. సొసైటీ మాలల సంక్షేమ కోసం పనిచేస్తోందన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సొసైటీ బలోపేతం కోసం కృషి చేస్తున్నామన్నారు. సొసైటీ మండల గౌరవ అధ్యక్షుడు పోతరాజు లింగం, శకోల సాయిబాబ, జింక సాయిరాం, శంకర్‌, పోచయ్య, సురేష్‌, నర్సింలు, సాయిలు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement