మద్నూర్(జుక్కల్): మేనూర్ గ్రామ పంచాయతీలో మంగళవారం తైబజార్ వేలం పాట నిర్వహించారు. 2026–27 సంవత్సరానికి వేలం పాట నిర్వహించగా గ్రామానికి చెందిన పలువురు పోటీ పడ్డారు. మేనూర్‌లో తైబజార్ వేలం పాటను ఈ యేడు ప్రారంభించామని అధికారులు తెలిపారు. గ్రామానికి చెందిన అవినాష్ రూ.60 వేలకు వేలంపాటలో దక్కించుకున్నట్లు పంచాయతీ అధికారులు తెలిపారు. సర్పంచ్ అశోక్ పటేల్, ఉప సర్పంచ్ మల్కయ్య, పంచాయతీ కార్యదర్శి హరీష్, వార్డు సభ్యులు, పాల్గొన్నారు.
తాండూర్‌లో..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తాండూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామసర్పంచ్ యాదగౌడ్ ఆధ్వర్యంలో 2026–27కు సంబంధించి తైబజార్ వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో 20 మంది పాల్గొనగా గ్రామానికి చెందిన కమ్మరి కిషోర్ రూ.48,500కు వేలంపాడి తైబజార్‌ను దక్కించుకున్నారు. ఉపసర్పంచ్ అభిషేక్, పంచాయతీ కార్యదర్శి తిరుపతితోపాటు వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


