భిక్కనూరు: రేషన్ లబ్ధిదారులకు మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఈ నెలలో ఒకేసారి పంపిణీ చేస్తామని తహసీల్దార్ సునీత తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఉచిత రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరికి 18 కిలోల చొప్పున మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తామన్నారు. రేషన్ డీలర్లు సమయపాలన పాటిస్తూ లబ్ధిదారులకు సకాలంలో బియ్యం పంపిణీ చేయాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా సహించేది లేదని హెచ్చరించారు. ఈ నెలాఖరు వరకు బియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని ఆమె తెలిపారు.


