● జిల్లాలో రూ.6.56 కోట్ల మేర
ప్రయాణ చార్జీల పొదుపు
● మహాలక్ష్మి పథకం విజయోత్సవ
çÜ¿ýæÌZ MýSÌñæ-MýStÆŠ‡ BÕ‹Ù çÜ…V>Ó¯Œæస…V>Ó¯ŒS
ఆర్థిక భారం
తగ్గించడంలో
కామారెడ్డి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆర్థిక భారం తగ్గించడంలో కీలక పాత్ర పోషించిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కామారెడ్డి ఆర్టీసీ డిపో ఆవరణలో నిర్వహించిన మహాలక్షి విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2023 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 290 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు చేశారని తెలిపారు. దీనివల్ల మహిళలు, విద్యార్థినులు కలిసి సుమారు రూ. 10 వేల కోట్ల మేర ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్నారని వెల్లడించారు. ఒక్క మన జిల్లాలోనే రూ. 6.56 కోట్ల వరకు మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలిగిందని పేర్కొన్నారు. ఈ ఆదా అయిన సొమ్మును మహిళలు తమ కుటుంబ అవసరాలకు, పిల్లల విద్యకు, ఆరోగ్యానికి వినియోగించుకోవడం హర్షణీయమన్నారు. మహిళా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వ్యాపార అవకాశాలు, బ్యాంకు రుణాలతో వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అలాగే ఉల్లాస్ కార్యక్రమం ద్వారా మహిళలకు విద్యా శిక్షణ అందిస్తూ వారిలో చైతన్యం నింపుతున్నామని తెలిపారు. అనంతరం ప్రతిరోజూ బస్సులో ప్రయాణించి ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న బి.సునీత (మేడిపల్లి), జి.ప్రశాంతి(మాందాపూర్), సమ్య బేగం (రామాయంపేట), ఏ.స్వప్న(దోమకొండ), ఎం.సరిత (దోమకొండ) మహిళా ప్రయాణికులను సన్మానించి, బహుమతులు అందజేశారు. అదనపు కలెక్టర్ మధుమోహన్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, అదనపు డీఆర్‌డీవో విజయలక్ష్మి, ఆర్డీవో గిరి, డిపో మేనేజర్ దినేష్, మెప్మా పీడీ శ్రీధర్‌రెడ్డి తదితరులున్నారు.


