భిక్కనూరు: మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం జంగంపల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళా డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉండాలని సూచించారు. బ్యాంకుల ద్వారా మహిళలకు కావలసిన రుణాలను అందిస్తారన్నారు. ప్రతి మహిళా కోటీశ్వరాలు కావాలన్న ఉద్దేశంతో వారికి ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. సర్పంచ్ శ్రీవాణి వాసు యాదవ్, ఉప సర్పంచ్ ప్రకాష్, మండల అధ్యక్షుడు బీమ్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి రాజబాబు గౌడ్, మండల యూత్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, నాయకులు గోండ్ల సిద్ధ రాములు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అందే దయాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మర్కల్‌లో మంగళవారం మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి సర్పంచ్ ప్రియాంక భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవన నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఉప సర్పంచ్ లింగం, ఏపీఎం ప్రసాద్, గ్రామ సమాఖ్య ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): వదల్‌పర్తిలో గ్రామ సంఘ భవన నిర్మాణానికి మంగళవారం గ్రామసర్పంచ్ సత్యబోయిన పద్మ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరయ్యాయన్నారు. పంచాయతీ కార్యదర్శి అజీమోద్దీన్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మర్కల్‌లో భూమి పూజ చేస్తున్న సర్పంచ్ ప్రియాంక
జంగంపల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న మద్దిచంద్రకాంత్‌రెడ్డి


