సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రజాస్వామ్య వ్యవస్థలో బీఎల్‌వోలే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ఎన్నికల మాస్టర్ ట్రైనర్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో మండల స్థాయి బీఎల్‌వోలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన హాజరై పలు సూచనలు చేశారు. ఓటరు లిస్ట్‌లో తప్పులు లేకుండా సర్వేను పకడ్బందీగా చేపట్టాలన్నారు. సర్వే చేసేటప్పుడు నిజమైన ఓటర్లను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. సర్వేలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, రామారెడ్డి తహసీల్దార్ ఉమలత, ఆర్‌ఐ సంతోష్, రవికాంత్, వివిధ గ్రామాల బీఎల్‌వో పాల్గొన్నారు.


