నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలకేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు చిత్రపటాలకు మంగళవారం వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాలాభిషేకం చేశారు. గ్రామాల్లో సీసీ రోడ్ల ఏర్పాటుకు రూ.3 కోట్ల70లక్షలు, గ్రామసంఘ భవనాల నిర్మాణాలకు రూ.కోటి 70 లక్షలు, మండలంలోని మాసాన్‌పల్లి శివారులో ఫుడ్ స్టోరేజీ గోదాం నిర్మాణానికి రూ.30 లక్షల నిధులు మంజూరు చేశారని సర్పంచ్‌లఫోరం మండలాధ్యక్షుడు మురళీమోహన్‌గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి కిష్టయ్య, సర్పంచ్‌లు మన్నె వెంకటి, సురేష్, సంజీవరావు, ప్రభుగౌడ్, అక్కల వర్షిణి, తదితరులు పాల్గొన్నారు.
గాంధారిలో..
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు చిత్రపటాలకు స్థానిక సర్పంచ్ రేణుక సంజీవు ఆధ్వర్యంలో మహిళా సమాఖ్య సభ్యులు మంగళవారం పాలాభిషేకం చేశారు. మండలంలో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాల కోసం ఎమ్మెల్యే రూ.2 కోట్లు మంజూరు చేశారు. దీంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ ఆధ్వర్యంలో చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
లింగంపేటలో..
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండలానికి ఉపాధి హామీ పథకం ద్వారా రూ.కోటి మంజూరు చేయించినందుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, ఉపసర్పంచ్ ప్రసాద్‌గౌడ్, నాయకులు రఫీయోద్దీన్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సక్రూనాయక్, నగేష్, మోహన్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


