తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వృక్షశా స్త్ర విభాగం పరిశోధక విద్యార్థి దాసరి రఘు డాక్టరేట్ సాధించారు. తెయూ ప్రొ ఫెసర్ విద్యావర్థిని పర్యవేక్షణలో ఎన్హాన్స్‌మెంట్స్ ఆఫ్ క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ యీల్డ్, వయాబిలిటీ అండ్ లో జర్మినేషన్ రేట్ ఇన్ క్లియోమ్ విస్కోసా అండ్ క్లియోమ్ గైనండ్రా బై అప్లికేషన్ ఆఫ్ బ్రాస్సినోస్టిరైడ్స్’ అనే అంశంపై రఘు పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. మంగళవారం ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా కేంద్రియ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాహుల్‌కుమార్ పరిశోధకుడిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.
సుభాష్‌నగర్: బీజేపీ ప్రకటించిన రాష్ట్ర కమిటీలో నిజామాబాద్ జిల్లా నేతలకు చోటు లభించింది. సీనియర్ నాయకులు భరత్‌రెడ్డి, డాక్టర్ ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి, గద్దె శ్రీనివాస్ (భూమన్న), మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, కంచెట్టి గంగాధర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. శాశ్వత ఆహ్వాన సభ్యులుగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్‌రెడ్డి రాష్ట్ర కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రి డి సత్యనారాయణ, శాసనసభాపక్ష మాజీ ఫ్లోర్ లీడర్ యెండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మను నియమించారు.


