బోధన్‌ కోర్టులో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

బోధన్‌ కోర్టులో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

Apr 1 2026 8:06 AM | Updated on Apr 1 2026 8:06 AM

న్యాయవాదుల సావనీర్‌ ఆవిష్కరణ

బోధన్‌టౌన్‌(బోధన్‌): బోధన్‌ కోర్టు ఆవరణతోపాటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు నిర్వహించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా కోర్టు ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు బృంద ప్రతినిధులు తెలిపారు.

నిజామాబాద్‌ లీగల్‌: నగరంలో మంగళవారం నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 2025– 26 సంవత్సరానికి గాను న్యాయవాదుల సావనీర్‌ను జిల్లా జడ్జి జీవీఎన్‌ భారతలక్ష్మి ఆవిష్కరించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంలో బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు, న్యాయవాదుల వివరాలతో రూపొందించిన సావనీర్‌ ఓ జ్ఞాపకంగా నిలిచిపోతుందని అన్నారు. సావనీర్‌ కమిటి అధ్యక్షుడు అమిడాల సుదర్శన్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, మాణిక్‌ రాజు, ఉపాధ్యక్షుడు రెంజర్ల సురేష్‌, సభ్యులు ప్రవీణ, అజీతా రెడ్డి, ఇంతియాజ్‌, ఆరెట్టి నారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement