నీటి సమస్య పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

నీటి సమస్య పరిష్కారం

Apr 1 2026 8:06 AM | Updated on Apr 1 2026 8:06 AM

నీటి సమస్య పరిష్కారం అవయవదాతకు అంతిమ వీడ్కోలు

మాచారెడ్డి: పాల్వంచ మండలం ఫరీదుపేటలో నీటి కొరత తీర్చడం కోసం మంగళవారం గ్రామ సర్పంచ్‌ జీడిపల్లి నరసింహారెడ్డి బోరు తవ్వించారు. దీంతో 10, 11, 12వ వార్డుల ప్రజలకు నీటి సమస్య తీరిందని సర్పంచ్‌ తెలిపారు. ఉప సర్పంచ్‌ కోల బాలాగౌడ్‌, వార్డు సభ్యులు మహేశ్వరి, రాజు, శ్రీకాంత్‌ గ్రామస్తులు ఉన్నారు.

మాచారెడ్డి: తాను చనిపోతూ అవయవదానంతో మరో ఐదుగురికి ప్రాణం పోసిన మాచారెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు గ్యార లక్ష్మి అంత్యక్రియలు మంగళవారం ఆమె స్వగ్రామం పోతారంలో అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఆయా గ్రామాల నుంచి వందలాది మంది తరలి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఉమారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకటి, మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు హాజరై నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement