కామారెడ్డి అర్బన్: ఎయిడ్స్‌పై సమాజంలో ఉ న్న అపోహలను తొలగించి, శాసీ్త్రయ దృక్పథంలో అవగాహన పెంచాలని ఎన్‌ఎస్‌ఎస్ రా ష్ట్ర ప్రోగ్రాం అధికారి నర్సింహగౌడ్ సూచించా రు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా తెలంగాణ విశ్వవిద్యాలయం రెడ్‌రిబ్బన్ క్లబ్, జాతీయ సేవా పథకంల ఆధ్వర్యంలో మంగళవారం ‘హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ– యువత పాత్ర’ అంశంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. నర్సింహగౌడ్‌తోపాటు చర్మవ్యాధి నిపుణులు వెంకటస్వామి, ప్రిన్సిపల్ విజయ్‌కుమార్, సమన్వయకర్త అపర్ణ మాట్లాడారు. ఎయిడ్స్ నివారణ ప్రతివ్యక్తి సామాజిక బాధ్యత అన్నారు. ఎయిడ్స్ నివారణపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు, ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు రాజ్‌గంభీర్‌రావు, శారద, చంద్రశేఖర్‌గౌడ్, శ్రీనివాస్‌రావు, సుధాకర్, విశ్వప్రసాద్, జిల్లా ఆరోగ్యాధికారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలో గురువారం సాయంత్రం నిర్వహించే వీరహనుమాన్ విజయయాత్రలో పాల్గొనాలని యాత్ర నిర్వాహకులు ప్రజలను కోరారు. యాత్ర సాయంత్రం 4 గంటలకు కోడూరు హన్‌మాన్ ఆలయం వ ద్ద ప్రారంభమవుతుందని, పెద్దబజార్ మీదు గా సాగుతుందని పేర్కొన్నారు. ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్యే వెంకటరమ ణారెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, ఏఎస్పీలను విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ప్రతినిధులు ఆహ్వానించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ ప్రతినిధులు నిత్యానందం, బొల్లిరాజు, వివేకానంద అశోక్, సామల గంగారెడ్డి, పట్నం రమేష్, శ్రీకాంత్‌రావు, ఏకేష్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : చిన్నారుల్లో మౌలిక భాష, గణిత సామర్థ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఫౌండేషన్ లర్నింగ్ స్టడీ సర్వే జిల్లాలో ముగిసిందని డీఈవో రాజు తెలిపా రు. ఎన్‌సీఈఆర్‌టీ ‘పరఖ్’ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని మద్నూర్ మండలంలో 2 పాఠశాలలు, డోంగ్లీ, బీబీపేట, బాన్సువాడ, మహ మ్మద్‌నగర్, సదాశివనగర్, గాంధారి మండలా ల్లో ఒక్కో పాఠశాలల్లో ఈ సర్వే చేశామన్నారు. 2022 నుంచి అమలవుతున్న మౌలిక భాష, గణిత సామర్థ్యాల సాధన(ఎఫ్‌ఎల్‌ఎన్) ఫలితాలను అంచనా వేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. ఎంపిక చేసిన ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ట్యాబ్‌ల ద్వారా పరీక్షించారన్నారు. విద్యార్థులనే కాకుండా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను కూడా ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా సర్వే చేసి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచామన్నారు. కార్యక్రమానికి జిల్లా సమన్వయకర్తగా ఏఎంవో వేణుగోపాల్, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్‌గా అఖిల్ వ్యవహరించారన్నారు.
కామారెడ్డి క్రైం: తనతో మాట్లాడుతున్నప్పుడు అత్యుత్సాహం చూపించిన ఏ ప్రజాప్రతినిధి భర్తపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అసహనం వ్యక్తం చేయలేదని డీపీఆర్‌వో తిరుమల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధి అయిన భార్య స్థానంలో ఆమె భర్త అన్నీ తానై మాట్లాడడంతో మీరెవరు అంటూ కలెక్టర్ ప్రశ్నించారని, అసహనం వ్యక్తం చేశారని ప్రచురితమైన వార్తలో వాస్తవం లేదని పేర్కొన్నారు. సోమవారం ఏ ప్రజాప్రతినిధి భర్తపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేయలేదని స్పష్టత ఇచ్చారు.
కామారెడ్డి టౌన్ : కా మారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని బీజేపీ రాష్ట్ర కమిటీలో శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమిస్తూ ఆ పార్టీ రా ష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా కేవీఆర్ పేర్కొన్నారు.


