కౌన్సిల్‌ కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

కౌన్సిల్‌ కన్నెర్ర

Mar 29 2026 6:59 AM | Updated on Mar 29 2026 6:59 AM

కౌన్సిల్‌ కన్నెర్ర బడ్జెట్‌ ఏకగ్రీవ ఆమోదం

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026

IIలో u

కామారెడ్డి టౌన్‌ : ఇద్దరు ఉన్నతాధికారులను సరెండ్‌ చేయాలని పార్టీలకు అతీతంగా కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు తీర్మానం చేశారు. ఇది కామారెడ్డి చరిత్రలో మొదటిసారి. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ సమక్షంలో శనివారం బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. నాలుగు గంటలపాటు సమావేశం వాడివేడిగా సాగింది.

మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌రెడ్డి, టీపీవో గిరిధర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పట్టణ అభివృద్ధిని విస్మరిస్తున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభమైన వెంటనే సానిటేషన్‌, నీటి సమస్య, వీధిలైట్ల నిర్వహణ అధ్వానంగా ఉందని కమిషనర్‌ను సభ్యులు నిలదీశారు. టీపీవో సమావేశానికి వచ్చి మధ్యలో వెళ్లిపోయి సభ్యులను అగౌరవపరిచారని మండిపడ్డారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగం పూర్తిగా అవినీతిమయమైందని, కమిషనర్‌, టీపీవోలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, సామాన్య ప్రజల పనులను పెండింగ్‌లో పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తాను ఫోన్‌ చేసినా కమిషనర్‌ లిఫ్ట్‌ చేయడం లేదని, తన మాటకు గౌరవం ఇవ్వడం లేదని చైర్‌పర్సన్‌ పేర్కొనడంతో అధికారుల వ్యవహారశైలి మరింత చర్చకు దారి తీసింది. సదరు అధికారులపై అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందే సభ్యులు పట్టుబట్టారు. వారి వ్యవహారశైలిపై విచారణ చేపట్టాలని మొదట మినిట్స్‌ బుక్స్‌లో రాయగా సభ్యులు వ్యతిరేకించారు. వారిని సరెండర్‌ చేయాల్సిందేనని కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుబట్టారు. ఈ మేరకు జేసీ సమక్షంలోనే తీర్మానం చేసి సంతకాలు చేశారు. అయితే తీర్మానంపై కలెక్టర్‌, స్థానిక సంస్థల కలెక్టర్‌ విచారణ తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

చైర్‌పర్సన్‌, అధికారులను నిలదీస్తున్న కౌన్సిల్‌ సభ్యులు

మున్సిపల్‌ చరిత్రలో మొదటిసారి

వాడివేడిగా సాగిన బడ్జెట్‌ సమావేశం

రూ.70.86కోట్ల ఆదాయం.. రూ.70.85 కోట్ల వ్యయ బడ్జెట్‌కు

ఏకగీవ్ర ఆమోదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement