సహకార సంఘాలు రైతులకు అండగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సహకార సంఘాలు రైతులకు అండగా ఉండాలి

Mar 29 2026 7:00 AM | Updated on Mar 29 2026 7:00 AM

దోమకొండ: సహకార సంఘాలు రైతులకు అండంగా ఉండాలని దోమకొండ సర్పంచ్‌ ఐరేని నర్సయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సహకార సంఘంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 2025–26 అర్థ వార్షిక నివేదిక మహాజనసభ రైతులతో కలిసి శనివారం నిర్వహించారు. స్వల్ప కాలిక అప్పులు, వసూలు, దీర్ఘకాలిక అప్పులు వసూలు, ఎరువులు, విత్తనాల పంపిణీ, వరి ధాన్యం కొనుగోలు కమిషన్‌పై ఆడిట్‌, ఇన్సూరెన్స్‌లపై సమావేశంలో చర్చించారు. సహకార సంఘంలో వచ్చిన ఆదాయం, వ్యయాలను సంఘం కార్యదర్శి బాల్‌రెడ్డి చదివి వినిపించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ పన్యాల నాగరాజ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ బొమ్మెర శ్రీనివాస్‌, మాజీ ఎంపీటీసీ సభ్యులు నల్లపు శ్రీనివాస్‌, నాయకులు అబ్రబోయిన స్వామి, సీతారాం మధు, నాగారపు ఎల్లయ్య,సహకార సంఘం క్లస్టర్‌ అధికారి రమేష్‌, మానిటరింగ్‌ అధికారి నాగేష్‌, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

దీర్ఘకాలిక రుణాలు చెల్లించాలి

తాడ్వాయి(ఎల్లారెడ్డి): పెండింగ్‌లో ఉన్న దీర్ఘకాలిక రుణాలు, స్వల్పకాలిక రుణాలను చెలించాలని సొసైటీ ప్రత్యేక అధికారి విష్ణు అన్నారు. మండల కేంద్రంలోని సింగిల్‌ విండో కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. రుణాల రెన్యూవల్‌, దీర్ఘకాలిక రుణాల వసూలు, కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై చర్చించి తీర్మానించారు.ఈ సందర్భంగా ఆదాయ, వ్యయాలను చదివి వినిపించారు. సమావేశంలో క్లస్టర్‌ అధికారి లక్ష్మణ్‌, మానిటరింగ్‌ అధికారి విఠల్‌, సీఈవో నర్సింలు, సిబ్బంది నితిశ్‌రెడ్డి, శ్రీకాంత్‌, బాలకిషన్‌, రమేశ్‌, రైతులు శ్యాంరావు, రాములు, రాజేశ్వర్‌రెడ్డి, సంజీవరెడ్డి, రవిందర్‌రెడ్డి, లింగం తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి

నిజాంసాగర్‌(జుక్కల్‌): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరియైన వసతులు కల్పించాలని మహాజన సభలో రైతులు కోరారు. శనివారం మహమ్మద్‌నగర్‌ సొసైటీ ఫంక్షన్‌ హాల్‌లో గున్కుల్‌ సొసైటీ మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకు వచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సొసైటీ ద్వారా సుతిలిని సరఫరా చేయాలని కోరారు. సమావేశంలో సొసైటీ పర్సన్‌ ఇన్‌చార్జి మురళిధర్‌గౌడ్‌, మహమ్మద్‌ నగర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, సర్పంచులు కుమ్మరిరాములు, రమేష్‌యాదవ్‌, జీవన్‌, కిరణ్‌, హరిన్‌, మాజీ సొసైటీ చైర్మన్‌ వాజిద్‌ అలీ నాయకులు నాగభూషణంగౌడ్‌, అతిక్‌, విజయ్‌, సాయిలు రైతులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement