ముగిసిన ఖో–ఖో శిక్షణ శిబిరం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఖో–ఖో శిక్షణ శిబిరం

Mar 29 2026 7:00 AM | Updated on Mar 29 2026 7:00 AM

ముగిసిన ఖో–ఖో శిక్షణ శిబిరం ఏప్రిల్‌ 4 నుంచి ఇంటిగ్రేటెడ్‌ పీజీ సెమిస్టర్‌ పరీక్షలు

తెయూ(డిచ్‌పల్లి):తెలంగాణ యూనివర్సిటీలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న వర్సిటీ మహిళల ఖో–ఖో శిక్షణ శిబిరం శనివారం ముగిసినట్లు స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ బాలకిషన్‌ తెలిపారు. ఈసందర్బంగా బాలకిషన్‌ మాట్లాడుతూ.. క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ శిక్షణ శిబిరం చాల ఉపయోగపడిందని తెలిపారు. వర్సిటీ ఫిజికల్‌ డైరెక్టర్‌ బీఆర్‌ నేత, వివిధ కళాశాలల ఫిజికల్‌ డైరెక్టర్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

కుర్ర మోహన్‌కు డాక్టరేట్‌

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగం పరిశోధక విద్యార్థి కుర్ర మోహన్‌ డాక్టరేట్‌ సాధించారు. వర్సిటీ ప్రొఫెసర్‌ బోయపాటి శిరీష పర్యవేక్షణలో ‘ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రియల్‌ వ్యర్థాల నిర్మూలన–ఆర్గానిక్‌ సింథసిస్‌ కోసం సమర్థవంతమైన రంధ్రాలు గల ట్రాన్సిషన్‌ మెటల్‌ ఆకై ్సడ్‌ ఆధారిత కాటలిటిక్‌ వ్యవస్థల తార్కిక రూపకల్పన’ అనే అంశంపై మోహన్‌ పరిశోధన పూర్తి చేసి సిద్ధాంతగ్రంథం సమర్పించారు. శనివారం తెయూలో నిర్వహించిన మౌఖిక పరీక్షకు ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌గా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జ్యోతి వ్యవహరించారు. పరిశోధకుడిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. సైన్స్‌ ఫ్యాకల్టీ డీన్‌ ప్రొఫెసర్‌ కె.సంపత్‌ కుమార్‌, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు వాసం చంద్రశేఖర్‌, మావురపు సత్యనారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల (అప్లయిడ్‌ ఎకనామిక్స్‌, ఇంటిగ్రేటెడ్‌ ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ)కు సంబంధించి 8, 10వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ /బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు ఏప్రిల్‌ 4 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ సంపత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 16 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement