కామారెడ్డి టౌన్ : జిల్లాలో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా సాగాయి. ఊరూవాడా అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలలో సీతారాముల కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్, హిందూవాహిని, బజరంగ్‌దళ్ తదితర సంఘాల ఆధ్వర్యంలో పలుచోట్ల భారీ శోభాయాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంతటా రామనామం ప్రతిధ్వనించింది. జిల్లాకేంద్రంలోని ధర్మశాల వద్ద ప్రారంభమైన శోభాయాత్ర పుర వీధుల మీదుగా సాగింది. భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
సోమ్లానాయక్ తండాలో బాలరాముడు


