సుభాష్‌నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్‌లీడర్‌గా 4వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని ప్రమోద్‌కుమార్ నియమితులయ్యా రు. బల్దియా ఎన్నికల్లో రెండవసారి ప్రమోద్‌కుమార్ కార్పొరేటర్‌గా ఎన్నికకావడంతో ఆయన ను ఫ్లోర్‌లీడర్‌గా నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు దినేష్‌కులచారి ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా దంపల్లి జ్యోతి, ఫ్లోర్ సెక్రెటరీగా మఠం పవన్‌కుమార్, పార్టీ విప్‌గా న్యాలం సునీత నియమితులయ్యారు. సునీత రెండుసార్లు బీజేపీ తరపున కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. దంపల్లి జ్యోతి తొలిసారి ఎస్సీ రిజర్వేషన్ కోటాలో కార్పొరేటర్ కాగా, మఠం పవన్ కూడా తొలిసారి కార్పొరేటర్ అయ్యారు.


