నిజాంసాగర్: యాసంగి పంటల సాగు అవసరాల కోసం శుక్రవారం నిజాంసాగర్ ప్రా జెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడు దల చేశారు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో నీరందించారు. శుక్రవారం ఐదో విడత నీటి విడుదల చేపట్టారు. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1,200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు.
కామారెడ్డి టౌన్ : వ్యవసాయ కూలీలకు ఉపాధి భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈజీఎస్‌ను నీరుగార్చొద్దన్నారు.
రాష్ట్ర కమిటీ ఎన్నిక
ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కృష్ణ (నారాయణపేట్), ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ(నిజామాబాద్), కోశాధికారిగా కిష న్(నిజామాబాద్), ఉపాధ్యక్షులుగా నాయిని రాజు(ఇల్లందు), వీరన్న(మహబూబాబాద్), గంగాధర్(నిజామాబాద్), సహాయ కార్యదర్శులుగా సలీం, వెంకయ్య, జాటోత్ కృష్ణ ఎన్నికయ్యారు. సమావేశంలో నాయకులు కిశోర్, రమేష్, కిశోర్, ప్రభాకర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ : మెదక్ జిల్లా తుప్రాన్‌లో 29న జరిగే ఎస్జీటీల విద్యా సదస్సును విజయవంతం చేయాలని ఎస్జీటీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కోరారు. శుక్రవారం బాన్సువాడలో ఎస్జీటీల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 312తో నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. పాత పెన్షన్ విధానం వర్తింప జేయాలని, పీఆర్సీ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చే శారు. సమావేశంలో ఉపాధ్యాయులు హ న్మండ్లు, విజయ్‌కుమార్, సత్యనారాయణ, దర్శనం పర్వయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
రెంజల్: కందకుర్తిలో ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాప కులు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ స్ఫూర్తి మందిరాన్ని శుక్రవారం లాంఛనగా ప్రారంభించారు. హెడ్గేవార్ పూర్వీకులు నివసించిన ప్రదేశంలో రూ. 30 కోట్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. పనులు తుది దశకు చేరుకున్నా యి. శుక్రవారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సంఘ్ అఖిల భారత వనవాసీ మార్గదర్శక్ సోమయాజులు ఈ స్ఫూర్తి మందిరంలో గృహప్రవేశం చేశారు.
వచ్చేనెలలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ రాక
వచ్చే నెల 11న ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ కందకుర్తికి రానున్నారని సంఘ్ ప్రతినిధులు తెలిపారు. హెడ్గేవార్ స్ఫూర్తి మందిర ప్రారంభోత్సవంలో ఆయన తోపాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. గృహ ప్రవేశ కార్యక్రమంలో కేశవ సేవా సమితి ప్రతినిధులు సుధాకర్‌రెడ్డి, మల్లికార్జున్, శ్రీధర్‌రెడ్డి, వాసు పాల్గొన్నారు.


