● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు
లింగంపేట: ఇందిరమ్మ పథకంతో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బాణాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూరి గుడిసెలో నివసిస్తున్న గ్రామానికి చెందిన తుర్క హాజీకీ మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో ఆ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. దీంతో సమస్య పరిష్కారం కోసం 15 కేవీ ట్రాన్స్‌పార్మర్‌ను 63 కేవీగా అప్‌గ్రేడ్ చేయించారు. అలాగే మరో రెండు ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంగమేశ్వర్, ఉపసర్పంచ్ సంజీవులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాగౌడ్, నాయకులు రాయిని అశోక్, విఠల్‌రెడ్డి, గోకుల్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.


