నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్‌పేటలోని ఆర్యవైశ్యసంఘం కల్యాణ మండపంలో మంగళవారం బీజేపీ నేత కొండ మీరాతాయి ఆధ్వర్యంలో కోలాల పోటీ లు నిర్వహించారు. అలాగే బుధవారం మండలస్థా యి భజన పోటీలు జరుపనున్నట్లు మీరాతాయి తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా రూ.5వేలు, ద్వితీయ బహుమతిగా రూ.3వేలు, తృతీయ బహుమతిగా రూ.2వేలు అందించనున్నట్లు ఆమె చెప్పారు. పోటీల్లో పాల్గొన్న ప్రతిజట్టుకు రూ.1,500 నగదుతోపాటు షీల్డ్‌లను అందించనున్నట్లు ఆమె వివరించారు.
ఆడపిల్లల ప్రాముఖ్యతపై
అవగాహన
బాన్సువాడ: ఆడపిల్లల ప్రాముఖ్యతపై మంగళవారం బాన్సువాడ మాత శిశు ఆస్పత్రిలో ఆడపిల్లల తల్లులకు అవగాహన కల్పించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారితా కేంద్రం భేటీ జన్మోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో సౌభాగ్య మాట్లాడుతూ.. ఆడపిల్లలకు కల్పించే సౌకర్యాల గురించి అవగాహన కల్పించారు. బేబీ కిట్స్ పంపిణీ చేశారు. సూపరింటెండెంట్ విజయభాస్కర్, వైద్యులు దివ్య, సుధ, ఆర్‌ఎంవో సుజాత, తదితరులు ఉన్నారు.


