బడ్జెట్‌లో విద్యా రంగానికి నిధులు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో విద్యా రంగానికి నిధులు పెంచాలి

Mar 25 2026 7:29 AM | Updated on Mar 25 2026 7:29 AM

కామారెడ్డి టౌన్‌ : ఉపాధ్యా య, విద్యారంగ సమస్యల ను తక్షణమే పరిష్కరించాల ని డిమాండ్‌ చేస్తూ తెలంగా ణ పొగ్రెసీవ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(టీపీటీఎఫ్‌) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవా రం జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ముందు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమా ర్‌ మాట్లాడుతూ.. విద్యా కమిషన్‌ రిపోర్ట్‌ ప్రకారం రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలన్నారు. కొత్త పీఆర్సీని వెంటనే ప్రకటించి, పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఇతర బిల్లులను విడుదల చేయాలని డి మాండ్‌ చేశారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్‌ వర్తింపజేయాలన్నా రు. జిల్లా అధ్యక్షుడు చింతల లింగం, ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నరేందర్‌, శ్రీనివాస్‌, నళిని, లక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement