కామారెడ్డి టౌన్ : నిజామాబాద్ ఎన్‌సీసీ బెటాలియన్ పరిధిలో కామారెడ్డికి చెందిన ఆర్కే డి గ్రీ కళాశాల ఎన్‌సీసీ యూనిట్ కెడెట్ సుధాంశు అద్భుత ప్రతిభ కనబరిచి బెస్ట్ కెడెట్ అవార్డును అందుకున్నాడు. మంగళవారం నిజామాబాద్ బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రియజిత్ చేతుల మీదుగా సుధాంశు ఈ అవార్డుతో పాటు న గదు రివార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా ప్రియజిత్ మాట్లాడుతూ.. సుధాంశు క్రమశిక్షణ, అంకితభావం ఇతర కెడెట్లకు స్ఫూర్తి దాయకమని కొనియాడారు. విద్యార్థిని ప్రోత్సహించిన కళాశాల యాజమాన్యాన్ని, ఏఎన్‌వోలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆ ర్కే గ్రూప్ సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేవలం చదువులోనే కాకుండా ఎన్‌సీ సీ, ఎన్‌్ ఎస్‌ఎస్, క్రీడలు, సాంస్కృతిక రంగా ల్లో విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కళాశాల డీన్ నవీన్, కో–ఆర్డినేటర్ దత్తాత్రి, ప్రిన్సిపాల్స్ గోవర్ధన్ రెడ్డి, గంగాధర్ పాల్గొన్నారు.
బాన్సువాడ : మాజీ ఉపప్రధాని బాబూజగ్జీవన్‌రామ్ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని సర్పంచ్ అనీల్‌కుమార్‌కు ఎంఆర్‌పీఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. మంగళవారం బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రామ సర్పంచి అనీల్‌కు వినతిపత్రం ఇచ్చారు. వార్డు సభ్యులు రాచకొండ బాలయ్య, అన్నం అనీల్, ఎంఆర్‌పిఎస్ నాయకులు హన్మాండ్లు, లాల య్య, సాయిలు, గంగారం, జ్ఞానేశ్వర్ ఉన్నారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘంలో మహాజన సభ నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యదర్శి సందీప్ అర్థ వార్షిక నివేదికను చదివి వినిపించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. జొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
భిక్కనరు: గ్రామీణప్రాంతాల్లో జీఐఎస్, జీపీఎస్, కృత్రిమ మేధతో భవిష్యత్‌కు మార్గదర్శ కంగా ఉంటుందని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావు అన్నారు. తెయూ సౌత్ క్యాంపస్‌లో మంగళవారం జియో ఇన్ఫర్మెమెటి క్స్ జాతీయ సెమినార్‌ను ఎన్‌ఆర్‌సీ డిప్యూటీ డై రెక్టర్ రాఘవస్వామి, ఉస్మానియా ప్రొఫెసర్ బాలకిషన్‌లతో కలిసి వీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఐఎస్, జీపీఎస్ సాంకేతికతో కృత్రిమమేధాను మిళితం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన ఎస్‌డీజీ లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. ఎన్‌ఆర్‌సీ డిప్యూటీ డైరెక్టర్ రాఘవస్వామి మాట్లాడుతూ.. జీపీఎస్, జీఐఎ స్ సాకేంతికను ఉపయోగించుకుని ఇస్రో సాంకేతిక అనువర్తనాలను గ్రామీణ అభివృద్ధిలో మిళితం చేయవచ్చన్నారు. ప్రొఫెసర్ బాల్‌కిష న్ మాట్లాడుతూ.. జీఐఎస్ సాంకేతికతో నేడు ‘గిగ్ ఎకానమీ‘ ఆధారపడి ఉందన్నారు. ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్, అధ్యాపకులు కవితా తోరన్, రాజేశ్వరి, మోహన్‌బాబు, నారాయణ, నాగరాజు, లలితలు పాల్గొన్నారు.


