సుభాష్‌నగర్: రైతు భరోసా పేరుతో తెలంగాణ రైతాంగాన్ని మళ్లీ మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకం మొదలుపెట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఒక ప్రకటనలో విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముందు రైతుల భావోద్వేగాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్.. రూ.12వేలకే పరిమితమైందన్నారు.


