బాన్సువాడ రూరల్: కోనాపూర్‌లో ఆదివారం నిర్వహించిన కుస్తీ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మల్లయోధులు తమ ప్రతిభ చూపి నగదు బహుమతులు పొందారు. చివరి కుస్తీపోటీలో గెలుపొందిన వారికి సంగోజీపేట్ గ్రామ సర్పంచ్ మంద సంగమేశ్వర్ తన తండ్రి మంద శ్రీరాములు జ్ఞాపకార్థం వెండి కడియాలు బహూకరించారు. జాతర సందర్భంగా దుకాణాలు వెళిశాయి. సర్పంచ్ ఎల్లగోని కిష్టవ్వ, ఉపసర్పంచ్ బంజ భూషణం, నాయకులు రాజేశ్వర్‌గౌడ్, జెట్టి హన్మాండ్లు, వార్డు సభ్యులుపాల్గొన్నారు.
లింగంపేటలో..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మత్తడి పోచమ్మ ఆలయం వద్ద ఆదివారం ఉగాది ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు దూరిశెట్టి అశోక్ తెలిపారు. కుస్తీ పోటీలు ఆధ్యంతం ఉత్కంఠంగా సాగాయి. చివరి కుస్తీ రూ.5 వేల నగదు బహుమతితో పాటు మరో కుస్తీ రూ.3 వేల నగదు బహుమతి అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. గెలుపొందిన వారికి సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు.


