కామారెడ్డి అర్బన్: కామారెడ్డి రోటరీ క్లబ్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం, తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు సబ్బని కృష్ణహరి ‘పద్మశాలి ఉగాది పురస్కారం’ అందుకున్నారు. ఆదివారం సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ కేవీబీ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన పద్మశాలి ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. సబ్బని కృష్ణహరి చేస్తున్న వివిధ సామాజిక సంఘ సేవకు గానూ సినీనటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
అమ్రాద్‌లో డొమెస్టిక్
సిలిండర్ల పట్టివేత
మాక్లూర్: మండలంలోని అమ్రాద్ గ్రామంలో ఆదివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఓ దుకాణంపై దాడులు నిర్వహించి 15 డొమెస్టిక్ సిలిండర్లను పట్టుకున్నారు. గ్రామంలో లక్ష్మన్ అనే వ్యక్తి ప్రభుత్వ రాయితీ సిలిండర్లను బ్లాక్‌లో అమ్ముతున్నాడనే సమాచారం రావడంతో వారు స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి లక్ష్మన్‌తోపాటు సిలిండర్లను పట్టుకున్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
బోధన్: హిందూ ధర్మం, సంస్కృతి పరిరక్షణకు ఐక్యంగా ముందుకెళ్లాలని కామారెడ్డి జిల్లా బిచ్కుంద సంస్థాన మఠాధిపతి షట్‌స్థల బ్ర హ్మ సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వా మిజీ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా పట్టణంలోని గంజ్ రోడ్‌లో గల రాధాకృష్ణ మందిరం (సాయిబాబా ఆలయం) ప్రాంగణంలో ఆదివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. స్వామీజీ ముఖ్య అథితిగా వి చ్చేసి, ప్రవచనాలు చేశారు. చిరుప్రాయం నుంచే తమ పిల్లలను ఆధ్యాత్మిక మార్గంలో నడిచే విధంగా చూడాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఇందూర్ విభాగ్ సహ చాలక్ పాలేటి వెంకట్‌రావు, ఆర్య వైదిక ధర్మప్రచారక్ ఉత్తూరు పద్మ మాట్లాడుతూ.. హిందూ బంధువులందరూ ధర్మ రక్షణకు ఐక్యతను, సమరసతను చాటాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్ల ప్రస్థానం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హిందూ సమ్మేళన కార్యక్రమం కొనసాగుతున్నాయని వెంకటరావు తెలిపారు. విశ్రాంత తహసీల్దార్ మురహరి, కమిటి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


