తాడ్వాయి: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌తో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పేర్కొన్నారు. ఆదివారం తాడ్వాయిలో బీఆర్‌ఎస్ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మూడుసార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టిందని, కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మాత్రం నిధులు కేటాయించడం మర్చిపోయిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేకే పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడం లేదని, దీంతో నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు రావడంలేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో అందరి అభివృద్ధికి కృషి చేశామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ముదాం నర్సింలు, సర్పంచ్‌లు మంగారెడ్డి, తాజొద్దీన్, నాయకులు రాజేశ్వ్‌రావు, మహిపాల్‌రెడ్డి, రాజిరెడ్డి, రాములు, సంజీవ్, ధర్మారెడ్డి, రాఘవరెడ్డి, రమేష్‌రావు, సాయిరెడ్డి, నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.


