రామారెడ్డి: ఉగాది నుంచి ప్రారంభమైన శ్రీసీతారామచంద్రస్వామి శ్రీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను వచ్చే నెల 4 వరకు వైభవంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుషనోల్ల రమేశ్ అన్నారు. గురువారం ఆలయ ప్రాంగణంలో సర్పంచ్ బండి ప్రవీణ్, ఉపసర్పంచ్ నవీన్, ఆలయ కమిటీ చైర్మన్ రంగు రవీందర్‌తో కలిసి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ.. ఈనెల 27న శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం, 28న గరుడ సేవ, 30న శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తామన్నారు. వచ్చేనెల 2న రథోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. నా గి రెడ్డిపేట ఎంపీడీవో కురుమ ప్రవీణ్, ఆలయ క మిటీ చైర్మన్ రవీందర్‌గౌడ్, సందీప్, మైపాల్, ఉత్సవ, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.


