నిజామాబాద్ రూరల్:పారామెడికల్ ల్యాబ్ టెక్నీషి యన్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, వారిని ఆర్థికంగా ఆదుకోవాలని పీఎంఎల్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో గురువారం జరిగిన జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకు ల్యాబ్ టెక్నీ షియన్‌లకు గుర్తింపే లేకుండ పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయినా పారామెడికల్ రంగానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ల్యాబ్ టెక్నీషియన్లకు ఆర్థిక భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజులలో రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌టీ మిత్రులను ఏకం చేసి వారి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సన్నీ, కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఇంతియాజ్, ఉపాధ్యక్షుడిగా శివ, ప్రధాన కార్యదర్శిగా ప్రశాంత్, కోశాధికారిగా కవిత, సహాయ కార్యదర్శిగా కళ్యాణ్, రఘు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా రాము, వంశీ ఎన్ని కయ్యారు. రవీందర్, తలారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


