సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఎండాకాలం సమపించక ముందే మేత కోసం మూగజీవాలు ఇబ్బందులు పడుతున్నాయి. గ్రామ పొలిమేరల్లో ఉన్న భూముల్లో రైతులు పంటలు సాగు చేసుకోవడంతో మూగజీవాలకు గ్రాసం దొరక్క అల్లాడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా గన్నారం తండాకు చెందిన 150 ఆవుల మందను గ్రాసం కోసం సదాశివనగర్ మండలానికి తోలుకొస్తున్న దృశ్యం సాక్షి కెమెరాకు చిక్కింది. పశువులు మేత మేయడానికి కనీసం గజం భూమి కూడా ఖాళీ లేకుండా ఉండడంతో తాము తమ ఆవులను ఈ ప్రాంతానికి తీసుకొచ్చినట్లు పశువుల కాపరులు పేర్కొన్నారు.


