కో–ఆప్షన్‌ పదవి ఎవరికో? | - | Sakshi
Sakshi News home page

కో–ఆప్షన్‌ పదవి ఎవరికో?

Mar 18 2026 7:46 AM | Updated on Mar 18 2026 7:46 AM

నాయకుల ప్రసన్నం కోసం చక్కర్లు

కొడుతున్న ఆశావహులు

ఈసారి నాలుగు స్థానాలా లేక

రెండు స్థానాలే కేటాయిస్తారా..?

బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించి నెల రోజులు కావొస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపికపైనే చర్చ కొనసాగుతోంది. కో–ఆప్షన్‌ ఎంపికపై రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. బాన్సువాడ పట్టణంలో స్థానిక లాబీయింగ్‌ మరింత ఊపందుకుంది.

ఆశీస్సులు ఎవరికో..

బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులకు 11 వా ర్డులు కాంగ్రెస్‌ స్థానాలు సాధించింది. మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్‌ దక్కని వారు నిరాశపడకుండా ము ఖ్య నాయకులు కో–ఆప్షన్‌ ఇస్తామని సర్ది చెప్పి పో టీ నుంచి తప్పించారు. కాంగ్రెస్‌ నాయకులు కొంద రు కో–ఆప్షన్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే గ తంలో బాన్సువాడ మున్సిపాలిటీకి నాలుగు కో–ఆప్షన్‌ పదవులు కేటాయించారు. 2020లో మైనార్టీ, బీసీ మహిళ, సీనియర్‌ సిటిజన్‌, డ్వాక్రా సంఘం స భ్యురాలికి కో–ఆప్షన్‌ పదవులు కేటాయించారు. ప్రస్తుతం నాలుగు కో–ఆప్షన్‌ స్థానాలు కేటాయిస్తా రా లేక రెండు స్థానాలే కేటాయిస్తారా అనే ప్రశ్న జో రుగా కొనసాగుతుంది. రెండు కో–ఆప్షన్‌ స్థానాలు కేటాయిస్తే ఒకటి మహిళకు, మరొక స్థానం మైనార్టీ కి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆశావహులు మాత్రం పదుల సంఖ్యలో ఉన్నారు. కో–ఆప్షన్‌ కోసం ఇటు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కా సుల బాల్‌రాజ్‌, మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిల ఆశీస్సుల కోసం ఆశావహులు చక్క ర్లు కొడుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులు తమ అర్హత లు, పార్టీకి చేసిన సేవలు, స్థానికంగా ఉన్న ప్రభావాన్ని ప్రస్తావిస్తూ నేతల ప్రసన్నం కోసం పరస్ప రం పోటీ పడుతున్నారు. మరి కో–ఆప్షన్‌ ఎవరిని వరిస్తుందో వారం రోజులు ఎదురు చూడాల్సిందే. కో–ఆప్షన్‌ కాకపోతే ఇతర నామినేటెడ్‌ పదవుల్లో అ వకాశం కల్పిస్తామని పలువురు నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement