పేరుకుపోయిన నిర్లక్ష్యం.. | - | Sakshi
Sakshi News home page

పేరుకుపోయిన నిర్లక్ష్యం..

Mar 18 2026 7:46 AM | Updated on Mar 18 2026 7:46 AM

కామారెడ్డి టౌన్‌ : జిల్లా కేంద్రంలోని ఆ మురికి కాలువలో పేరుకుపోయిన చెత్త కుప్పకు ఇప్పుడు పుట్టినరోజు వేడుకలు చేయడమే తక్కువ. అవును.. 12 నెలలు గడిచినా, క్యాలెండర్లు మారినా.. అక్కడి వ్యర్థాలు మాత్రం ఇంచు కూడా కదలడం లేదు. మున్సిపల్‌ సానిటేషన్‌ విభాగం నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందంటే.. ఒక కాలువను శుభ్రం చేయడానికి వీరికి ఏడాది కాలం కూడా సరిపోవడం లేదని స్థానిక ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్డులో ఉన్న ఈ బడా మురికి కాలువను గత కౌన్సిల్‌ హయాంలో నూతనంగా నిర్మించారు. ఆ తర్వాత ప్రత్యేక పాలన ఏడాది గడిచి, ఇప్పుడు కొత్త కౌన్సిల్‌ కొలువుదీరింది. పాలకులు మారారు తప్ప, ఈ కాలువ రాత మాత్రం మారలేదు. నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ మురికి కాలువను శుభ్రం చేసిన దాఖలాలు లేవని స్థానికులు వాపోతున్నారు. కాలువలో చెత్తాచెదారం భారీగా పేరుకుపోవడంతో మురుగు నీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికే అధికారులు, ప్రజాపతినిధుల కళ్లముందే కనిపిస్తున్న ఈ బడా కాలువను పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement