‘సమర్థవంతంగా జనగణన నిర్వహించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘సమర్థవంతంగా జనగణన నిర్వహించాలి’

Mar 16 2026 7:30 AM | Updated on Mar 16 2026 7:30 AM

కామారెడ్డి అర్బన్‌ : జిల్లాలో జనాభా గణనను సమర్థవంతంగా నిర్వహించడానికి సన్నద్ధంగా ఉండాలని అడిషనల్‌ కలెక్టర్‌(రెవెన్యూ) విక్టర్‌ సూచించారు. జనగణనపై అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టరేట్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ముందుగా తొలిదశలో గృహజాబితా, గృహ గణన చేయాల్సి ఉంటుందని, ఇందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. 33 అంశాలతో జనాభా గణన పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్‌ పద్ధతిలో ఉంటుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) మధుమోహన్‌, సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, జెడ్పీ సీఈవో చందర్‌, ఆర్డీవో వీణ, సీపీవో రఘునందన్‌, జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement