అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్లు

Mar 9 2026 7:35 AM | Updated on Mar 9 2026 7:35 AM

అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్లు

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): అర్హులైన నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని జెడ్పీ సీఈవో చందర్‌ నాయక్‌ అన్నారు. ఆదివారం తిమ్మోజీవాడిలో ఇందిరమ్మ గృహాల నిర్మాణాల పనులను ప్రారంభించి మాట్లాడారు. పనులను వేగవంతంగా చేపట్టాలన్నారు. ఎంపీడీవో సంతోష్‌కుమార్‌, సర్పంచ్‌ భవాని తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశాలు

దోమకొండ: మండల కేంద్రంలో ఆదివారం పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేశారు. మాజీ జెడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్‌ హాజరై వస్త్రాలు అందజేశారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా కార్యదర్శి అబ్రబోయిన స్వామి, పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, ఏఎంసీ డైరెక్టర్‌ గోపాల్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదల పక్షపాతి కాంగ్రెస్‌

భిక్కనూరు: కాంగ్రెస్‌ పార్టీ నిరుపేదల పక్షపాతి అని కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం భిక్కనూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భిక్కనూరు సర్పంచ్‌ బల్యాల రేఖ నూతన వస్త్రాలు, సారెను బహూకరించారు. ఉప సర్పంచ్‌ దుంపల మోహన్‌రెడ్డి, ఈవో మహేశ్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

తాడ్వాయి(ఎల్లారెడ్డి): ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, అధికార ప్రతినిధి షౌకత్‌అలీ అన్నారు. ఆదివారం కృష్ణాజీవాడిలో అదే గ్రామానికి చెందిన జంగం రేణుక నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, అధికార ప్రతినిధి షౌకత్‌ అలీ, నాయకులు రాజీవ్‌ కుమార్‌, నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement