బరంగెడ్గిలో మహిళా ఉద్యోగులకు..
సాక్షి నెట్‌వర్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆయా రంగాల్లో విజయాలు సాధించిన మహిళలతో పాటు పలువురిని ఈ సందర్భంగా ప్రముఖులు శాలువాలతో సన్మానించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు. మహిళలు విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పురుషులకు మహిళలు ఏ రంగంలోనూ తీసిపోరని చాలా మంది నిరూపించారని గుర్తు చేశారు.


