మిల్లర్లపై చర్యలకు రంగం సిద్ధం
తప్పనిసరిగా చర్యలుంటాయి
కామారెడ్డి క్రైం: సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఎగ్గొట్టిన జిల్లాలోని 20 మంది రైస్ మి ల్లర్లపై కేసులు నమోదు చేసే ది శగా జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. గతంలో డిఫాల్టర్లుగా ఉండి బియ్యం తిరిగి ఇవ్వకపోవడం గానీ, నగదు రూపంలో చెల్లించడం గానీ చేయకుండా తప్పించుకు తిరుగుతున్న మ రో 23 మందిపై ఇటీవలే పోలీ సు ఉన్నతాధికారులకు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు ఫిర్యాదు చేశారు. వారితో పాటు 2024–25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం తీసుకొని మరాడించిన తర్వాత బియ్యం ప్రభుత్వానికి తిరిగి ఇవ్వని 20 మంది మిల్లర్లపై చర్యలకు జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది.
ఏసీబీ సోదాలతో వెలుగులోకి..
జిల్లాలో మొత్తం 162 రైస్‌మిల్లులు ఉన్నాయి. వా టిలో 35 బాయిల్డ్, 127 రా రైస్‌మిల్లులు ఉన్నాయి. వడ్లను మరాడించి బియ్యంగా మార్చే ప్రక్రియ కో సం ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రా ల నుంచి మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేస్తుంది. ఇలా ప్రతి యేటా కేటాయించిన ధాన్యం నుంచి కొంత మొత్తాన్ని మిల్లర్లు పక్కదారి ప ట్టిస్తుంటారు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపుల విషయంలో కొంత కాలంగా కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. నెల రోజుల క్రితం కామరెడ్డి కలెక్టరేట్‌లోని సివిల్ సప్లయ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆ కస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో పెద్ద మొత్తంలో బియ్యం పక్కదారి పట్టిన ట్లు గుర్తించారు. వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ఇటీవల టాస్క్‌ఫోర్స్ బృందం డిఫాల్టర్లుగా ఉన్న మిల్లులలో ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. 20 రైస్‌మిల్లులకు కేటాయించిన దాదాపు రూ.91 కోట్ల విలువైన 24 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వలేదని గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
పాతవి మరో 23 మిల్లులు..
గతంలో (2022–2024 వరకు) ప్రతి సీజన్‌లోనూ ధాన్యం తీసుకొని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వని మరో 23 రైస్‌మిల్లులపై కూడా కేసులు నమోదు చేసేందుకు సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారులు ఇటీవ ల జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ బియ్యం విలువ రూ.80 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. వాటితో పాటు తాజాగా 20 మిల్లుల విషయంలో సంబంధిత డి ప్యూటీ తహసీల్దార్లు పంచనామాలు చేపడుతున్నా రు. పంచనామాలు పూర్తి కాగానే చర్యలకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతలోగా సదరు మిల్లర్లు వచ్చి బియ్యానికి సమానమైన నగదు చెల్లింపులు చేసుకుంటే కేసుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మిల్లర్లపై కేసులు తప్పవని అధికారులు చెబుతున్నారు.
గతంలో 23 మంది డిఫాల్ట్ మిల్లర్లపై చర్యలకు పోలీసు శాఖకు ఫిర్యాదు చేశాం. డీఫాల్ట్‌గా ఉన్న వారికి గతేడాది ధాన్యం కేటాయింపులు చేయలేదు. తాజాగా 2024–25 ఖరీఫ్‌లో బియ్యం తీసుకొని తిరిగి ఇవ్వని 20 మంది మిల్లర్ల విషయంలో పంచనామాలు చేపడుతున్నాం. తొందర్లోనే కేసులు నమోదు చేస్తాం. – శ్రీకాంత్, డీఎం,
సివిల్ సప్లయ్ కార్పొరేషన్, కామారెడ్డి
జిల్లాలో రూ.90 కోట్ల బియ్యం
మింగేసిన మిల్లర్లు
నోటీసులు జారీచేసిన అధికారులు
20 మంది మిల్లర్లపై కేసుల
నమోదుకు అవకాశం


