ఎల్లారెడ్డి ఆర్డీవోగా రొడ్డ ప్రభాకర్
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి ఆర్డీవోగా రొడ్డ ప్రభాకర్ బదిలీపై వస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఎల్లారెడ్డి ఆర్డీవోగా పని చేస్తున్న పార్థసింహారెడ్డి చేవేళ్లకు బదిలీ కాగా ఆయన స్థానంలో పదోన్నతిపై రొడ్డ ప్రభాకర్ బదిలీపై వస్తున్నట్లు వారు తెలిపారు.
ఎల్లారెడ్డి/తాడ్వాయి/బీబీపేట : నాగర్‌కర్నూల్ జిల్లాలో రజకులపై జరిగిన దాడికి నిరసనగా ఎల్లారెడ్డి, తాడ్వాయి, బీబీపేట మండల కేంద్రాల్లో బుధవారం రజకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. రజక సంఘం నాయకులు సాయిప్రసాద్, జేఏసీ నాయకులు పసులాది లక్ష్మణ్, లింగం, చాకలి సంఘం సభ్యులు గౌరయ్య, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండల ఐకేపీ ఏపీఎంగా వెంకటలక్ష్మి బుధవారం విధుల్లో చేరారు. గత ఆరునెలలుగా నాగిరెడ్డిపేట మండలంలో ఇన్‌చార్జి ఐకేపీ ఏపీఎంతోనే నెట్టుకురావడంపై ఈ నెల 18న ‘రెగ్యూలర్ ఏపీఎం నియామకమెప్పుడో’అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పదోన్నతిపై కామారెడ్డి జిల్లాకు వచ్చిన ఏపీఎం వెంకటలక్ష్మిని నాగిరెడ్డిపేట మండలానికి కేటాయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏపీఎం వెంకటలక్ష్మి నాగిరెడ్డిపేట ఐకేపీ కార్యాలయంలో విధుల్లో చేరారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల పరిషత్ కార్యాలయం వద్ద బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో సంతోష్‌కుమార్‌లు పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 22 మందికి ఈ చెక్కులను అందజేసినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు లింగాగౌడ్, సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దిన్, మాజీ వైస్ ఎంపీపీలు గాదారి శ్రీనివాస్ రెడ్డి, రూపెందర్ రెడ్డి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ వడ్ల రాజేందర్, మండల యూత్ అధ్యక్షుడు శ్యాంబాబు, ఏఎంసీ చైర్మన్ సంగ్యనాయక్, మాజీ విండో చైర్మన్ సదాశివరెడ్డి, నాయకులు లింగారెడ్డి, కటికె రమేశ్, బత్తుల రాములు, వివిధ గ్రామాల జీపీవోలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఆర్డీవోగా రొడ్డ ప్రభాకర్
ఎల్లారెడ్డి ఆర్డీవోగా రొడ్డ ప్రభాకర్
ఎల్లారెడ్డి ఆర్డీవోగా రొడ్డ ప్రభాకర్


