సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

Feb 25 2026 7:16 AM | Updated on Feb 25 2026 7:16 AM

సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

దోమకొండ: నూతన పంచాయతీ పాలవర్గాలు గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మండల ప్రత్యేకాధికారి, జిల్లా హార్టికల్చర్‌ అధికారి జ్యోతి అన్నారు. మంగళవారం సంఘమేశ్వర్‌లో నిర్వహించిన గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. నూతన పంచాయతీ పాలకవర్గాలు అధికారులతో కలిసి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఎంపీడీవో ప్రవీణ్‌ కుమార్‌, ఎంపీవో రవికుమార్‌, గ్రామ సర్పంచ్‌ లోయపల్లి శ్రీనివాస్‌రావ్‌, ఉపసర్పంచ్‌ నీలస్వామి, కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement