కుర్చీ దగ్గర మొదలైన పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

కుర్చీ దగ్గర మొదలైన పంచాయితీ

Feb 25 2026 7:16 AM | Updated on Feb 25 2026 7:16 AM

కుర్చ

కుర్చీ దగ్గర మొదలైన పంచాయితీ

సర్పంచ్‌కే చాంబర్‌ ఉంటుంది

దారి లేకుండా చేశారు

గాంధారి(ఎల్లారెడ్డి): గండివేట్‌ గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికై న పాలకవర్గం మధ్య విభేదాలు తలెత్తాయి. సర్పంచ్‌ పదవి మహిళకు రిజర్వ కావడంతో కొమ్ము అనూష సర్పంచ్‌గా ఎన్నికై ంది. ఉప సర్పంచ్‌గా పెద్ద కాశీరాం ఎన్నికయ్యారు. అ యితే వీరు కూర్చుండే కుర్చీల విషయంలో విభేదా లు తలెత్తాయి. సర్పంచ్‌ చాంబర్‌లోనే ఉప సర్పంచ్‌ కాశీరాం టేబుల్‌ కుర్చీ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గది ఇరుకుగా మారింది. సర్పంచ్‌ కుర్చీలోకి వెళ్లడానికి దారి లేక ఇబ్బందిగా మారింది. సర్పంచ్‌ మ హిళ కావడంతో గది ఇరుకుగా ఉందని ఉప సర్పంచ్‌ టేబుల్‌ వేరే చోట ఏర్పాటు చేసుకోవాలని సూ చించారు. తాను వేరే చోట ఎందుకు ఏర్పాటు చేసు కోవాలని సర్పంచ్‌ గదిలో తాను కూడా కూర్చుంటానని ఉప సర్పంచ్‌ స్పష్టం చేశాడు. ఈ విషయా న్ని సర్పంచ్‌ ఎంపీవో, డీపీవోకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు ఉప సర్పంచ్‌ ఏర్పాటు చేసుకున్న టేబుల్‌, కుర్చీని తీసేయాలని సూచించారు. తాను దళితుడైనందుకే తన కుర్చీ, టేబుల్‌ తీసేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట దళిత సంఘాల నాయకులతో ఉప సర్పంచ్‌ ధర్నా చేశారు.

గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌కే చాంబర్‌ ఉంటుంది. ఉప సర్పంచ్‌కు ఉండదు. సామరస్యంగా ఉంటే ఏమీ కాదు. కాని అభ్యంతరాలుంటే సర్పంచ్‌కే చాంబర్‌ ఏర్పాటు ఉంటుంది. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి ఇరు వర్గాలకు నచ్చచెప్పాం. కానీ ఉప సర్పంచ్‌ మొండికేసి ధర్నా చేశారు.

– లక్ష్మీనారాయణ, ఎంపీవో, గాంధారి

సర్పంచ్‌ గది ఇరుకుగా ఉంది. అందులోనే రెండు టేబుళ్లతో పాటు పదుల సంఖ్యలో కుర్చీలు వేయడంతో మరీ ఇబ్బందిగా మారింది. మహిళా సర్పంచ్‌ అని కూడా కనీస మర్యాద ఇవ్వడంలేదు. తాను కుర్చీలోకి వెళ్లాలంటే తలుపును మూసి వెళ్లాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు విచారణ చేసి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలి.

– అనూష, సర్పంచ్‌, గండివేట్‌

జీపీ ఎదుట ఉప సర్పంచ్‌ వర్గం ధర్నా, దళితుడినని అవమాసిస్తున్నారని

ఆరోపణ

సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ కుర్చీల గొడవ.. ఒకే గదిలో రెండు టేబుళ్లకు స్థలంలేక ఇబ్బందులు

కుర్చీ దగ్గర మొదలైన పంచాయితీ1
1/1

కుర్చీ దగ్గర మొదలైన పంచాయితీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement