సంక్షేమ ఫలాలు సక్రమంగా అందేలా చూడాలి
కామారెడ్డి క్రైం: సంక్షేమ ఫలాలు సక్రమంగా, సకాలంలో లబ్ధిదారులకు అందేలా చూడాలని తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ అధికారులకు సూచించారు. జిల్లాకు మంగళవారం ఆయన విచ్చేయగా, కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలుపై సుధీర్ఘంగా సమీక్షించారు. అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
దోమకొండ: రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఆయన రైతునేస్తం కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రైతులకు యూరియా బుకింగ్ సంబంధించిన యాప్ గురించి తెలియజేశారు. యాప్‌ను ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకుని రైతు ఫోన్‌నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ కావాలన్నారు. దీనిపై రైతులందరికి అవగాహన కల్పించాలని మండల అధికారులకు సూచించారు. ఏఈవో కిష్టారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్, రైతులు నేతల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: ఎవరైనా సరే కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల జోలికి వస్తే సహించేది లేదని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. పట్టణంలోని కళాశాల ముందు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కళాశాల భూములను కాపాడటంలో విద్యార్థి సంఘాలదే కీలక పాత్ర అని, రాజకీయాల కోసం విద్యాసంస్థల ఆస్తులను పక్కదారి పట్టించడం తగదని అన్నారు. డిగ్రీ కళాశాల భూముల్లో అక్రమంగా నిర్మించిన ప్రయివేట్ పాఠశాలలు, కళాశాల భవనాలను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కోరారు. అరోరా ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారంలో పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యేదేనని ఆరోపించారు. నాయకులు బాలు, విఠల్, అరుణ్ కుమార్, లక్ష్మణ్, సురేష్, నాగరాజు, భరత్‌కుమార్ పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన భూముల వివరాలపై కలెక్టర్ తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడు చరణ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కళాశాల ఎదుట మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం కళాశాల పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్న భూమి వివరాలను మ్యాప్‌తో సహా మీడియా సాక్షిగా ప్రకటించాలని కోరారు. 2021లో నిర్వహించిన సర్వే వివరాలను బహిర్గతం చేయాలని, కబ్జాదారుల కోరల నుండి కళాశాల భూములను రక్షించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు సంజయ్, పవన్, విష్ణు, చరణ్, రాకేష్, భరత్, సిద్ధు పాల్గొన్నారు.
సంక్షేమ ఫలాలు సక్రమంగా అందేలా చూడాలి
సంక్షేమ ఫలాలు సక్రమంగా అందేలా చూడాలి
సంక్షేమ ఫలాలు సక్రమంగా అందేలా చూడాలి


