రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

Feb 25 2026 7:13 AM | Updated on Feb 25 2026 7:13 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

వివిధ శాఖల అధికారులతో

జిల్లాస్థాయి సమావేశాల నిర్వహణ

కామారెడ్డి క్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. పట్టణంలోని కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. హైవేలపై అభివృద్ధి పనులు, వేగ వంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నార్కోటిక్‌ కో–ఆర్డినేషన్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లా రిజిస్ట్రేషన్‌ అథారిటీ కమి టీ సమావేశాన్ని నిర్వహించి, మాట్లాడారు.. జిల్లా లో సరైన పత్రాలు సమర్పించనందుకు గాను 11 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశామన్నారు. డీఎంహెచ్‌వో అనుమతి లేకుండా వైద్యానికి సంబంధించిన ఎలాంటి కొత్త కేంద్రాలను ప్రారంభించకూడ దని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్‌ మధు మోహన్‌, ఏఎస్పీ నరసింహ రెడ్డి, ఐఎంఏ అధ్యక్షుడు శ్రీధ ర్‌, కార్యదర్శి మల్లికార్జున్‌, వైద్యులు వెంకటస్వామి, విద్య, రోహిత్‌, వేణుగోపాల్‌, చలపతి పాల్గొన్నారు.

‘ఇన్నోవేషన్‌’ కరపత్రాల ఆవిష్కరణ

కామారెడ్డి క్రైం: పట్టణంలోని కలెక్టరేట్‌లో మంగళవారం ఇన్నోవేషన్‌ కార్యక్రమం వాల్‌పోస్టర్లను కలెక్ట ర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు సంబంధించిన యువతను ప్రోత్సహించడానికి ఈనెల 28న ఇన్నోవేషన్‌ పంచాయతీ పేరుతో నిజామాబాద్‌లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. నూతనంగా ఆవిష్కరణలు సిద్ధం చేసే ఆసక్తి కలిగిన జిల్లాలోని యువత ఎవరైనా కార్యక్రమంలో పాల్గొని, ప్రతిభను చా టాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement