ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

Feb 25 2026 7:13 AM | Updated on Feb 25 2026 7:13 AM

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

నేటి నుంచి మార్చి 18 వరకు

కొనసాగనున్న ఎగ్జామ్స్‌

జిల్లాలో 37 పరీక్షా కేంద్రాలు,

17,953 మంది విద్యార్థులు

కామారెడ్డి టౌన్‌: జిల్లాలో ఇంటర్మీడియట్‌ వార్షిక ప రీక్షలు నేటి నుంచి ప్రారంభం కానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం (25వ తేదీ) ప్రథమ సంవత్సరం, గురువారం (26వ తేదీ) నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు మొదలవుతాయి. వచ్చే నెల 18వ తేదీతో ముగియనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 17,953 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరంలో జనరల్‌ విద్యార్థులు 7,231 మంది, వొకేషనల్‌ వారు 1,782 మంది ఉ న్నారు. ద్వితీయ సంవత్సరంలో జనరల్‌ 7,194 మంది, వొకేషనల్‌ 1,746 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరికోసం జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశా రు. వీటిలో 16 ప్రభుత్వ కళాశాలలు, 12 ప్రభుత్వ సంస్థలు, 9 ప్రైవేట్‌ కళాశాలల భవనాలున్నాయి. ప రీక్షల నిర్వహణ కోసం 37 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 37 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీస ర్లు, ఆరుగురు సిట్టింగ్‌ స్క్వాడ్‌లు, ఇద్దరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, ఇద్దరు జిల్లా కోఆర్డినేటర్లను నియమించారు. కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాలకు ఇద్దరే సి చొప్పున కస్టోడియన్లను కేటాయించారు. ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించడమే కాకుండా, పరీక్షలన్నీ సీసీ కెమెరాల ప ర్యవేక్షణలో జరగనున్నాయి. మాస్‌ కాపీయింగ్‌ ని రోధనకు కలెక్టర్‌, ఎస్పీ, ఇంటర్‌ నోడల్‌ అధికారులతో కూడిన హైపవర్‌ కమిటీ పర్యవేక్షించనుంది.

5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థు లు గంట ముందే కేంద్రాలకు చేరుకోవచ్చు. పరీక్షా సమయానికి 45 నిమిషాల ముందు నుంచే లోపలికి అనుమతిస్తారు. కేవలం 5 నిమిషాల వరకు మాత్ర మే ఆలస్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. విద్యా ర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. పరీక్షలు జరిగే సమయంలో సమీపంలోని జి రాక్స్‌ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాల ను కేంద్రంలోకి అనుమతించరు. విద్యార్థుల కోసం వై ద్య సిబ్బందిని అందుబాటులో ఉంచి, ఓఆర్‌ఎస్‌ ప్యా కెట్లు, మందులు, తాగునీటి సౌకర్యం కల్పించారు.

ఏర్పాట్లు పూర్తి చేశాం..

జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షలను సజావుగా నిర్వహిస్తాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. విద్యార్థులు నిర్ణీత సమయం కంటే గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.

– షేక్‌ సలాం, ఇంటర్‌ జిల్లా నోడల్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement