శనగ కొనుగోళ్లు ఎప్పుడో? | - | Sakshi
Sakshi News home page

శనగ కొనుగోళ్లు ఎప్పుడో?

Feb 25 2026 7:13 AM | Updated on Feb 25 2026 7:13 AM

శనగ కొనుగోళ్లు ఎప్పుడో?

శనగ కొనుగోళ్లు ఎప్పుడో?

శనగ కొనుగోళ్లు ఎప్పుడో?

త్వరలో కొనుగోళ్లు చేస్తాం..

మద్నూర్‌(జుక్కల్‌): జిల్లాలో శనగ పంట చేతికొచ్చినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అన్నదాతలు తమ పంటను తక్కువ ధరకు దళారులకు అమ్మాల్సిన పరిస్థితి నెలకొంది. ఈయేడు రైతులు శనగ పంటపై ఆశలు పెట్టుకున్నప్పటికీ మద్దతు ధర, తగ్గిన దిగుబడితో ఫలితం లేకుండపోతోంది. అధికారులు, ప్రభుత్వం మాత్రం శనగ పంట కొనుగోలుపై ఊసేత్తకపోవడం, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు.

తగ్గిన పంట దిగుబడి..

గతంలో ఎకరాకు శనగ పంట పది క్వింటాళ్లకు వరకు దిగుబడి వచ్చేది. కాలం కలిసిరాక, వాతావరణం అ నుకూలించకపోవడంతో ప్రస్తుతం పంట దిగుబడిపై తీవ్ర ప్రబావం చూపింది. దీంతో ఎకరాకు ఆరు నుంచి ఏడు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ఎనభై శాతం మంది రైతులు శనగ పంట వేసేవారు. కానీ రానురాను పంట దిగుబడులు తగ్గుతూ వస్తుండటంతో రైతులు ఇతర పంటలు వేసుకుంటున్నారు. జిల్లాలో శనగ పంట 42,408 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. జిల్లా మొత్తం ఐదు లక్షల క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. ఈసారి మూడు లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చేలా కనబడుతోంది. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,875 ప్రకటించింది. కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక రైతులు దళారులకు పంటను క్వింటాల్‌కు రూ.5200–5300 చొప్పున అమ్ముకుంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఎన్‌సీసీఎఫ్‌ వాళ్లు ఎంఎస్‌పీ ధరతో శనగ కొనుగోలు ఏజెన్సీ తీసుకున్నారు. వారితో నేను మాట్లాడాను. ఇక్కడ శనగ పంట కొనుగోలు కేంద్రాల అవశక్యతపై నివేదికలు పంపించాను. మరో వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావచ్చు. రైతులు ఆందోళన చెందవద్దు. వంద శాతం ప్రభుత్వ మద్దతు ధరతో శనగ కొనుగోలు కేంద్రాలు మొదలవుతాయి.

– శశిధర్‌రెడ్డి, జిల్లా మార్క్‌ఫెడ్‌ అధికారి

జిల్లాలో చేతికొచ్చిన పంట దిగుబడి

సర్కార్‌ కొనుగోలు కేంద్రాల

ఏర్పాటుపై స్పష్టత కరువు

దళారులకు తక్కువ ధరకు

అమ్ముకుంటున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement