కక్షతోనే కేవీఆర్‌పై సీఎం దాడులు
● ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
● కామారెడ్డిలో ఎమ్మెల్యే
వెంకటరమణారెడ్డికి పరామర్శ
కామారెడ్డి టౌన్: రేవంత్‌రెడ్డి సీఎం పదవిలోకి వచ్చినా తన గుణం మార్చుకోలేదని, కామారెడ్డిలో ఓడిపోయానన్న కక్షతోనే ఇక్కడ ఎమ్మెల్యేపై దాడు లు చేయిస్తున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కామారెడ్డి ఎమ్మె ల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం ఆ యన పట్టణంలోని ఎమ్మెల్యేను పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాకేశ్ రెడ్డి మాట్లాడారు. కొడంగల్‌కు రూ. 10 వేల కోట్లు తీసుకెళ్లిన సీఎం, కామారెడ్డి అభివృద్ధికి ఏమిచ్చారో చెప్పాలని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడుసార్లు ఓడిపోయి న షబ్బీర్ అలీని అడ్డుపెట్టుకుని సీఎం దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. షబ్బీర్ అలీకి ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే చెప్పండి, నేనే వీసా ఇప్పిస్తా సౌదీ వెళ్లిపోవచ్చు‘ అని ఎద్దేవా చేశారు. సమ సమాజం అని మాట్లాడే మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే కు సమాచారం లేకుండా శంకుస్థాపనలు, సభలు ఎలా నిర్వహిస్తున్నారని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో 80 మందిని గెలిపించుకుని సచివాలయంపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేది చిన్న తప్పు ఉన్నా కేవీఆర్‌తోపాటు తాను రాజీనామా చేస్తానని సవాల్ విసురుతూ, బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఎమ్మెల్యే కేవీఆర్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్ పరామర్శ..
కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేవీఆర్‌ను మంగళవారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరామర్శించారు. ఆదిలాబాద్ జిల్లా బీజేపీ శ్రేణులతో కలిసి వచ్చిన ఆయన కేవీఆర్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. కేవీఆర్ ఎదుగుదలను చూ సి ఓర్వలేక ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కు ట్రలు పన్నుతున్నాడని శంకర్ విమర్శించారు.
కక్షతోనే కేవీఆర్‌పై సీఎం దాడులు


