సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి కృషి

Feb 24 2026 7:06 AM | Updated on Feb 24 2026 7:06 AM

సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి

ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ రావు

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): వజ్జపల్లి తండాలో నెలకొ న్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మె ల్యే మదన్‌మోహన్‌ రావు సూచించారు. సోమవా రం యాచారంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు శంకర్‌ నాయక్‌ వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వజ్జపల్లి తండాలో సర్పంచ్‌ సంధ్య ఎమ్మెల్యేకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. నూతనంగా ఏర్పడిన తండాల్లో పంచాయతీ భవనాలు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మదన్‌మోహన్‌ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు లింగాగౌడ్‌, సీడీసీ చైర్మన్‌ ఇర్షాదొద్దిన్‌, మాజీ విండో చైర్మన్‌ సదాశివరెడ్డి, యాచారం సర్పంచ్‌ గణేశ్‌ నాయక్‌, పాల్గొన్నారు.

మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ఎల్లారెడ్డి: మహిళల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. సోమవా రం లక్ష్మాపూర్‌లో మహిళా సంఘం భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.ఎమ్మెల్యే మాట్లాడు తూ..మహిళలు గ్రామ సంఘాల ద్వారా వ్యాపా రా లు నిర్వహించి ఆదాయం పొందాలని అన్నారు. స ర్పంచ్‌ మంజుల,కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

గాంధారి(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు సోమవారం గాంధారిలో పర్యటించారు. మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement