శివాజీ అడుగు జాడల్లో నడవాలి
మద్నూర్(జుక్కల్): నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ మహరాజ్ అడుగుజాడల్లో నడవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మండల కేంద్రంలో శివాజీ జయంతిని సార్వజనిక్ శివ జన్మోత్సవ్ సమితి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ శివాజీ స్ఫూ ర్తితో ముందుకు సాగాలని అన్నారు. అనంతరం మండల కేంద్రంలో శివాజీ జయంతిని పురస్కరించుకొని ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
పిట్లం(జుక్కల్): స్థానిక ఏఎంసీ కార్యాలయంలో సోమవారం లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వమే అండగా ఉంటుందన్న భరోసాను కల్పించడమే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. సర్పంచ్ కుమ్మరి శేఖర్, ఏఎంసీ డైరెక్టర్ షేక్ నజీర్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇమ్రోజ్, ప్రచార కమిటీ అధ్యక్షుడు బొడ్ల రాజు, కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు .
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
శివాజీ అడుగు జాడల్లో నడవాలి


