తెరపైకి భూముల వివాదం! | - | Sakshi
Sakshi News home page

తెరపైకి భూముల వివాదం!

Feb 24 2026 7:04 AM | Updated on Feb 24 2026 7:04 AM

తెరపై

తెరపైకి భూముల వివాదం!

అధికారికంగా వివరాలు వెల్లడిస్తే సమాధానం దొరుకుతుంది..

కాలేజీ స్థలంలో నిర్మించిన ఇంజనీరింగ్‌ కళాశాల భవనం

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిల మధ్య సాగిన మాటల యుద్ధంలో కాలేజీ భూముల వివాదం తెరపైకి వచ్చింది. కాలేజీ భూములను ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీకి ఇవ్వడం వెనుక అక్రమాలు జరిగాయంటూ షబ్బీర్‌అలీ ఆరోపణలు చేశారు. అరోరా ఇంజనీరింగు కాలేజీ యాజమాన్యం భూమిపై హక్కులు పొంది బ్యాంకులో తాకట్టుపెట్టిందని షబ్బీర్‌ ఆరోపించారు. అరోరాకు భూముల కేటాయింపు వ్యవహారంలో ఎమ్మెల్యేను, ఆయన కుటుంబ సభ్యులను షబ్బీర్‌ అలీ టార్గెట్‌ చేశారు. ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే కేవీఆర్‌ తీవ్రంగా స్పందించారు. కామారెడ్డి ప్రాంతంలో ఉన్నత విద్య అందించాలన్న లక్ష్యంతా తన తండ్రి కేపీ రాజారెడ్డితోపాటు పలువురు ప్రముఖులు కలిసి అప్పట్లో 263.20 ఎరరాల భూములు సేకరించి భవనం నిర్మించి కాలేజీ ప్రారంభించారని తెలిపారు. కాలేజీ వేలాది మందికి జీవితాన్నిచ్చిందన్నారు. కాలేజీ భూములను వాళ్లు కాపాడడం వల్లే ఈరోజు మెడికల్‌ కాలేజీ నిర్మాణం జరుగుతోందన్నారు. కాలేజీ భూముల్లోనే అప్పట్లో సబ్‌ స్టేషన్లు, గోదాములు, ఇండస్ట్రీస్‌, స్టేడియం, డెయిరీ కాలేజీ.. ఇలా ఎన్నో నిర్మాణాలు జరిగాయని పేర్కొన్నారు. భూముల కేటాయింపులో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. రాజకీయ అవసరాల కోసం షబ్బీర్‌అలీ ప్రతిసారి కాలేజీ భూముల వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న షబ్బీర్‌అలీ ముఖ్యమంత్రితో మాట్లాడి రికార్డులను తెప్పించుకుని ఎక్కడ అక్రమాలు జరిగాయో తేల్చాలని డిమాండ్‌ చేశారు. కాలేజీకి సంబంధించిన ఒక్క గజం భూమి కూడా తాను దుర్వినియోగం చేసినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు.

కలెక్టర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

కాంగ్రెస్‌ నాయకులు సందీప్‌, చందు తదితరులు జిల్లా కలెక్టర్‌ను కలిశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్‌ దగ్గర తేల్చుకుందామన్న ఎమ్మెల్యే ఆర్‌టీఐ కింద దరఖాస్తు చేసి తప్పించుకున్నారని ఆరోపించారు. తాము అన్ని ఆధారాలతో కలెక్టర్‌ దగ్గరకు వెళ్లామని చెప్పారు. తప్పు జరగలేదంటూనే చర్చకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. కాలేజీ ఆస్తుల విషయంలో విద్యార్థి సంఘాలు, మేధావులు, కుల సంఘాలతో జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమాలు లేవదీస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజీనామా చేసే వరకు వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటైన 1964 నుంచి ఇప్పటి వ రకు ఏ సర్వే నంబరులో, ఏ సంవత్సరంలో ఎంత భూ మి, ఎవరికి కేటాయించారు అన్న వివరాలను ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినట్టు ఎమ్మెల్యే కేవీఆర్‌ తెలిపారు. ఆర్‌టీఐ కింద పూర్తి వివరాలు ఇవ్వాలని లేఖ ఇచ్చినట్టు ఎమ్మెల్యే వివరించారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారన్నా రు. తన దగ్గర అన్ని వివరాలు ఉన్నప్పటికీ, జిల్లా కలెక్టర్‌ స్వయంగా అధికారిక రికార్డుల్లో ఉన్న వివరాలను వెల్లడిస్తే తనపై షబ్బీర్‌అలీ చేసిన ఆరోపణలకు సమాధానం దొరుకుతుందని ఎమ్మెల్యే అన్నారు. కాలేజీ భూములు ఆక్రమణకు గురికాలేదని స్పష్టం చేశారు. గ్రౌండ్‌కు సంబంధించి ఎనిమిదన్నర ఎకరాల భూమి మీద కోర్టులో నడుస్తున్న కేసుల వెనుక ఏ నాయకుల అండ ఉందో ప్ర జలకు తెలుసన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో మంజూరైన తెలంగాణ యూనివర్సిటీని ష బ్బీర్‌ అలీ కామారెడ్డిలో ఏర్పాటు చేయించలేకపోయాడ ని విమర్శించారు. అప్పుడు మంత్రిగా పనిచేసి ఒరగబెట్టిందేమీ లేదన్నారు.

ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు మధ్య సాగిన మాటల యుద్ధంలో డిగ్రీ కళాశాల భూముల వివాదం తెర పైకి వచ్చింది. మున్సిపల్‌ ఎన్నికల సమ యంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ప్రభు త్వ సలహాదారు షబ్బీర్‌ అలీ మధ్య మొదలైన సవాళ్ల పర్వం చివరకు ఉద్రిక్తతలకు దారితీసింది. ఇప్పటికీ రాజకీయవేడి చల్లారడం లేదు.

అరోరాకు కేటాయింపులపై

షబ్బీర్‌ ఆరోపణలు

సీఎంకు చెప్పి విచారణ చేయించాలని కేవీఆర్‌ సవాల్‌

కలెక్టర్‌ను కలిసి వివరాలు ఇవ్వాలని కోరిన ఎమ్మెల్యే

మలుపులు తిరుగుతున్న

రాజకీయాలు

తెరపైకి భూముల వివాదం!1
1/1

తెరపైకి భూముల వివాదం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement