నిజాలు నిగ్గుతేలాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

నిజాలు నిగ్గుతేలాల్సిందే..

Feb 24 2026 7:04 AM | Updated on Feb 24 2026 7:04 AM

నిజాలు నిగ్గుతేలాల్సిందే..

నిజాలు నిగ్గుతేలాల్సిందే..

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి కళాశాల భూములకు సంబంధించి కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న ఆరో పణల్లో నిజాలు నిగ్గుతేలాల్సిందేనని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (కేవీఆర్‌) అన్నారు. సోమవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయం నుంచి ఒంటరిగా కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, అదనపు కలెక్టర్‌ విక్టర్‌, ఆర్డీవో వీణతో సమావేశమై చర్చించారు. కళాశాల భూములకు సంబంధించిన వాస్తవాలను బయట పెట్టాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కింద కలెక్టర్‌కు దరఖాస్తు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నా దగ్గర ఉన్న పత్రాలు అధికారికం కాకపోవచ్చు, కానీ ప్రభుత్వ అధికారులే స్వయంగా వివరాలు వెల్లడిస్తే నిజం ఏంటో ప్రజలకు తెలుస్తుంది‘ అని అన్నారు. తన తండ్రి కానీ, తాను కానీ ఎలాంటి తప్పు చేయలేదనే విషయం ప్రజలందరికీ తెలియాలన్నారు. ఏది నిజమో అదే చెప్పాలని కలెక్టర్‌ను తాను కోరానన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్‌ పార్టీయేనని, షబ్బీర్‌ అలీ ప్రభుత్వ సలహాదారుగా ఉండి కూడా ఈ రచ్చ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కావాలనుకుంటే సీఎంవో ద్వారా రెండు నిమిషాల్లో డాక్యుమెంట్లు తెప్పించుకోవచ్చని, కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే తనపై బురదజల్లుతున్నారని విమర్శించారు. 2004 నుండి 2009 వరకు మంత్రిగా ఉన్న షబ్బీర్‌ అలీ, అప్పట్లో ఈ ఆరోపణలను ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. 1964 నుంచి ఇప్పటి వరకు ఉన్న 263 ఎకరాల కళాశాల భూములను ప్రజా ప్రయోజనాల కోసం వాడుతున్నారా లేక స్వార్థం కోసం వాడుతున్నా రా అనే దానిపై పూర్తి వివరాలు ఇచ్చి, ఈ వివాదానికి ముగింపు పలకాలని అధికారులను కోరినట్లు తెలిపారు. సొసైటీ, ఆస్తుల పరిరక్షణ కమిటీ ఉండబట్టే ఆ భూములు అన్యక్రాంతం కాలేవని, విద్యాసంస్థలు వెలిశాయని అన్నారు. కలెక్టర్‌పై నమ్మకం ఉందని నెల రోజుల్లో వివరాలు ఇవ్వకుంటే తదుపరి చర్యలకు వెళ్తానని పేర్కొన్నారు. కామారెడ్డికి రావాల్సిన తెలంగాణ యూనివర్సిటీని రాకుండా షబ్బీర్‌ అలీ చేశారని ఆరోపించారు. పోలీసులు తమను అరెస్టు చేసి, కాాంగ్రెస్‌ నాయకులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ప్రాణభయం ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. పోయేటప్పుడు ఒక్కడి ని పోయినా తనతో పాటు పది మందిని పట్టుకెళ్తానని అన్నారు.

రాజకీయ లబ్ధి కోసమే

నాపై అసత్య ఆరోపణలు

ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కళాశాల ఆస్తుల వివరాల కోసం ఆర్టీఐ కింద దరఖాస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement