ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

Feb 24 2026 7:04 AM | Updated on Feb 24 2026 7:04 AM

ఫిర్య

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

కామారెడ్డి క్రైం : ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 83 దరఖాస్తులు వచ్చాయి. భూ సమస్యలు, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణం, పనుల బిల్లులు, తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వినతులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ విక్టర్‌, ఆర్డీవో వీణ, జెడ్పీ సీఈవో చందర్‌, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పత్తి కొనుగోళ్ల

గడువు పొడిగింపు

కామారెడ్డి క్రైం : సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్ల గడువును రైతుల సౌకర్యార్థం ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గడువులోగా రైతులు తమ సమీపంలోని సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించవచ్చని పేర్కొన్నారు. గత శనివారం వరకు ఉన్న పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించినట్లు తెలిపారు. 27 తర్వాత గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నేడు కలెక్టరేట్‌లో జాబ్‌మేళా

కామారెడ్డి అర్బన్‌ : బజాబ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌లో ఉద్యోగాల భర్తీ కోసం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం ఉద యం 10.30 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి ఎం కిరణ్‌కుమార్‌ సో మవారం ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం డిగ్రీ చదివి 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయ స్సు వారు హాజరుకావొచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 83748 97054, 63057 43423 నంబర్లను సంప్రదించాలన్నారు.

రాష్ట్ర స్థాయి సైన్స్‌టాలెంట్‌

టెస్ట్‌కు ఎంపిక

లింగంపేట(ఎల్లారెడ్డి) : మండల కేంద్రంలో ని బాలుర ఉన్నత పాఠశాల తొమ్మిదిదో తర గతి విద్యార్థి బొడ్డు కుశ్వంత్‌ రాష్ట్ర స్థాయి సై న్స్‌ టాలెంట్‌ టెస్ట్‌కు ఎంపికై నట్లు మండల వి ద్యాధికారి, ప్రధానోపాధ్యాయుడు షౌకత్‌అలీ తెలిపారు. సోమవారం కామారెడ్డిలో ని ర్వహించిన సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌లో ప్రతిభ చూపి జిల్లా స్థాయిలో కుశ్వంత్‌ ద్వితీయ స్థా నంలో నిలిచాడన్నారు. కుశ్వంత్‌ను ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
1
1/1

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement