ఘనంగా ఊరపండుగ
దోమకొండ: మండల కేంద్రవాసులు ఆదివారం ఊర పండుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగలో భాగంగా స్థానిక బురుజు వద్ద ఉదయం రంగం కార్యక్రమం నిర్వహించారు. రంగం చెప్పే వ్యక్తి భవిష్యవాణి వినిపించారు. కార్యక్రమంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బురుజు కోటతో పాటు ఊరడమ్మ ఆలయం వద్ద గావుపట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు అలరించాయి. అనంతరం గ్రామం చుట్టూ సరి చల్లారు. అనంతరం ఊళ్లోని అన్ని ఇళ్లకు తాళాలు వేసి, వనభోజనాలకు తరలి వెళ్లారు. గ్రామంలోని దాదాపు 4 వేల కుటుంబాలు వనభోజనాలకు తరలివెళ్లాయి. కార్యక్రమంలో సర్పంచ్ ఐరేని నరసయ్య, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, ఊర పండగ నిర్వాహకులు మర్రి శేఖర్, సిద్ధారెడ్డి, కూర చంద్రం, సంతోష్‌రెడ్డి, కొండ అంజన్, పాలకుర్తి శేఖర్, బిసు సతీష్, బత్తిని సిద్ధరాములు, కుంచాల శేఖర్, నర్సారెడ్డి, అనంతరెడ్డి, ఉన్న లక్ష్మణ్, బుర్ర బాపురెడ్డి, నాగారపు ఎల్లయ్య, మేక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఊర పండుగ రంగం కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు


